అసోంలోని ఓ జిల్లాకు విశ్వకవి పేరు

58చూసినవారు
అసోంలోని ఓ జిల్లాకు విశ్వకవి పేరు
అసోంలోని ఓ జిల్లాకు విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేరును పెడుతూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కరీంగంజ్‌ పేరును శ్రీ భూమిగా మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఠాగూర్ వంద ఏళ్ల క్రితం కరీంగంజ్‌ గడ్డను మా లక్ష్మీగా అభివర్ణించారని, ఆయన గౌరవార్థం నేడు ఈ ప్రాంతానికి శ్రీ భూమిగా పేరు మారుస్తున్నామని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్