పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యమే ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్ పట్టినపుడు తవుడుతో పాటు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే పూర్వపు రోజుల్లో పెద్ద వారు తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మంచివని.. వాటినే ఆహారంగా తీసుకునేవారు. వీటిని తీసుకుంటే మధుమేహం, రక్తపోటు ముప్పును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.