ఫిదా మూవీతో సాయిపల్లవి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డు అందుకోవాలని ఆశగా ఉందని, దాని కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. ' మా అమ్మమ్మ ఒక చీర ఇచ్చి పెళ్లి రోజు కట్టుకోమని చెప్పింది. కానీ నేను సినిమాలోకి వచ్చాక ఏదో ఒక రోజు ప్రతిష్టాత్మక అవార్డు ఫంక్షన్‌లో కట్టుకోవాలని నిర్ణయించుకున్న' అని తెలిపింది.