డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్బంగా అతని చిత్ర పటానికి పూల మాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.