ముల్కలపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

69చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో పశు వైద్య కేంద్రం, జడ్పీహెచ్ఎస్ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం మొదలైన చోట్ల మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ వైద్యాధికారి కార్తీక, కార్యదర్శి శశిధర్ రెడ్డి, ఉపాధ్యాయులు, కారోబార్ శ్యామ్, డ్వాక్రా వీవోఏలు, పశువైద్య సిబ్బంది, పాఠశాల, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్