జనగాం జిల్లా నిడిగొండ గ్రామం వద్ద ఆదివారం రాత్రి 11 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగాం నగరంలో నివాసముంటున్న లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన డ్రైవర్ మహ్మద్ పాషా అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ గతంలో జనగామ రూరల్ సీఐ దగ్గర పని చేశాడని, ప్రస్తుతం జనగామ డిఎంహెచ్ఓకు డ్రైవర్ గా పని చేస్తున్నాడని వివరించారు. సంఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.