ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను నెరవేర్చే వరకు బ్రతుకు భరోసా నిరవధిక సమ్మె విరమించేది లేదని ఆర్ఎంపి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి అనపురపు వెంకన్న అన్నారు. సోమవారం జనగామ జిల్లా ఆర్ఎంపీ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన జనగాం కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న గ్రామీణ వైద్యుల బ్రతుకు భరోసా నిరవధిక సమ్మెకు హాజరై సంఘీభావం తెలిపారు.