ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

85చూసినవారు
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గురువారం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలనర్సయ్య, దామోదర్, రాజు, మనోహర్ కుమార్, ప్రభాకర్, శేఖర్, బాను, నవీన్, రమేష్, నాస్తిక్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్