జిల్లా కేంద్రమైన జనగామ వడ్లకొండ గ్రామ సబ్ స్టేషన్ లో పెరుగుతున్న లోడ్ నేపథ్యంలో మరమ్మతులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జనగామ డివిజన్ లో ఉన్న సబ్ స్టేషన్లు ఓబుల్ కేశపూర్, అడివికేశపూర్, మరిగడి, గానుగపాడు, పెంబర్తి, జనగామ, కలెక్టరేట్ సబ్ స్టేషన్, కళ్లెం, జీడికల్, పసరుమడ్ల, లింగాలగణపురం పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.