ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్.. ఐదుగురికి షాక్

5331చూసినవారు
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్.. ఐదుగురికి షాక్
ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..హైదరాబాద్ మియాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుసుకుని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి, ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్