ములుగు మండలం భూపాల్ నగర్ గ్రామంలో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా ఇంటి గోడ కూలి ఆగమ్మ (75)అనే వృద్ధురాలు మృతి చెందింది. భారీ వర్షానికి తడిసిన గోడ కూలడంతో ఇటుక రాళ్లు మీదపడి వృద్ధురాలు నిద్రలోనే మృతి చెందిందని బుధవారం స్థానికులు తెలిపారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు.