ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా: మంత్రి సీతక్క

1922చూసినవారు
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా: మంత్రి సీతక్క
ములుగు జిల్లా సమీపంలో ఇటివల గుర్తు తెలియని వాహనం ఢీకొని ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన గుగులోత్ రవీందర్ తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం వారిని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరామర్శించి వారి కుటుంబానికి దైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్