ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని రంగాపూర్ (పందిరిదోన) గ్రామానికి చెందిన ఎట్టి నందిని అనే మహిళ సోమవారం అర్ధరాత్రి పురుటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికం అయ్యాయి. వెంటనే ఈఎంటీ యుగంధర్ ప్రసవం చేశారు. అనంతరం మంగళవారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పైలట్ సైదులు ఉన్నారు.