కోడి పందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్సై తాజుద్దీన్ కథనం మేరకు. ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామ సమీపంలోని చెట్ల వద్ద కొంత మంది కోడిపందాలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై తాజుద్దీన్ తన సిబ్బందితో ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.