చదువుల తల్లికి ఆర్థికసాయమందించిన మంత్రి సీతక్క

76చూసినవారు
చదువుల తల్లికి ఆర్థికసాయమందించిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన సంకె పల్లవి గేట్ 104వ ర్యాంకు సాధించి ఐఐటి ముంబైలో ఎంటెక్ సీటు పొందింది. ప్రవేశ రుసుం చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో మంత్రి సీతక్క ఆదేశాలమేరకు గ్రామ అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో సోమవారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య పల్లవికి రూ. 70వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అనంతరం విద్యార్థినిని శాలువాతో సన్మానించి అభినందించారు.

ట్యాగ్స్ :