వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంపై మంగళవారం ములుగు జిల్లా కలెక్టర్ తో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడారు. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంటల మార్పిడి, పంటలకు వచ్చే చీడలు, సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.