నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్ శ్రీజ

52చూసినవారు
నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్ శ్రీజ
ములుగు జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 20న చేపట్టనున్న నులి పురుగుల నివారణ కార్యక్రమంపై ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ సోమవారం టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ ప్రభావం వల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్