ములుగు జిల్లాలో ఒక్కటే ఉక్కపోత

79చూసినవారు
ములుగు జిల్లాలోని ములుగు, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం తదితర మండలాల్లో మూడు రోజులుగా ఎండలు తీవ్రంగా పెరిగాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండతో పాటు, ఉక్కపోత ఉండడంతో అల్లాడిపోతున్నారు. మూడు రోజులుగా వర్షాలు కురవడం లేదు. ఏజెన్సీలో ఎండల తీవ్రత తట్టుకోలేక ప్రజలు కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నట్లు గురువారం మీడియాకు తెలిపారు. వర్షాలు లేకపోయినా గాలి ఉంటే బాగుండేదని అంటున్నారు.

సంబంధిత పోస్ట్