
ములుగు జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు రాకూడదు
ములుగు జిల్లాలో రానున్న వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అన్నారు. బోర్లు, పైపులైన్ల పనితీరును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు.