ఖానాపురం: గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

77చూసినవారు
ఖానాపురం: గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి
వరంగల్ జిల్లా ఖానాపూరం మండలంలోని వేపచెట్టుతండా శివారు కోమటిపల్లి తండాకు చెందిన ఆర్మీ జవాన్ గుగులోతు రమేష్ గురువారం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 13 సంవత్సరాలుగా ఆర్మీ ఉద్యోగం చేస్తున్న రమేష్ మరణంతో తండా వాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తండావాసులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్