నర్సంపేట: షాద్ నగర్ఎమ్మెల్యే తీరు ను నిరసిస్తూ వెలమల ఆందోళన

60చూసినవారు
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ శుక్రవారం వెలమ కులస్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెలమ కులస్థులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిరసనలో డాక్టర్ మోహన్ రావు, కమలాకర్ రావు, రవిందర్ రావు, వెంకటేశ్వర్ రావు, తక్కలపల్లి సంపత్ రావు, కోటేశ్వరరావు, భూపాల్ రావు, యుగంధర్ రావు, ఎర్రబెల్లి విద్యాసాగర్ రావు, పోల్సాని రవిందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్