వరంగల్ నర్సంపేట రోడ్డుహోల్ సేల్ కాంప్లెక్స్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ధన త్రయోదశిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించినట్లు ఆలయ అర్చకులు అన్నవజ్జల భరత్ కుమార్ తెలిపారు. అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి 365 రకాల నైవేద్యాలను సమర్పించి నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించారు.