
మహిళల వన్డే ప్రపంచ కప్.. చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్
కొలంబోలో బుధవారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 221 పరుగులు చేసింది. బెత్ మూనీ 109 పరుగులు (114 బంతుల్లో, 11 ఫోర్లు), అలానా కింగ్ 51* (49 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాయి. పాక్ 36.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. సిద్రా అమీన్ 35 పరుగులతో టాప్ స్కోరర్. రమీన్ షమీమ్ 15, ఫాతిమా సనా 11, నష్రా సంధు 11 పరుగులు మాత్రమే చేయగలిగారు.