జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామంలో ఆదివారం బిఆర్ఎస్ నాయకులతో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ పార్లిమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.