జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శనివారం ముఖ్యఅతిథిగా బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య హాజరై మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యం భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.