జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

79చూసినవారు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నీడికొండ రైల్వే వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాదుకు చెందిన రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కారులో మేడారానికి వెళ్తున్నారు. నీడికొండ వద్దకు రాగానే కారు టైరు పంచరై డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్