ప్రభుత్వ నిషేధిత గుట్కాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదివారం వరంగల్ మిల్స్ కాలని పోలీసులు అరెస్టు చేశారు. కరీమాబాద్ కు చెందిన విజయ్నకుమార్ రామన్నపేటకు చెందిన వంశీకృష్ణ గుట్కాలను వాహనంలో తరలిస్తున్నారు. ఏకశిలనగర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వాహనంలో రూ. 5లక్షల విలువైన గుట్కాలు లభించాయని సీఐ మల్లయ్య తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.