ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైవులో ప్రయాణిస్తున్న బినాయక్ దాల్ అనారోగ్యంతో రైలులోనే మృతి చెందినట్లు బుధవారం వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారూ. రైలు వరంగలు రావడంతో జనరల్ కోచ్లో స్పృహలో లేని బినాయక్ దాల్ ను ప్లాట్ఫాంపైకి తరలించి 108 సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని చెప్పారు. ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లా బజ్రకోటేకు చెందిన కూలిగా గుర్తించినట్లు సీఐ తెలిపారు.