ఖిలావరంగల్లో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఓ దొంగ చేతి వాటం ప్రదర్శించాడు. ముఖ్య అతిథిగా వచ్చిన ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్తున్న సమయంలో ఖిలావరంగల్ కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు కలిశాడు. రద్దీ ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తి కాంగ్రెస్ నేత జేబులో ఉన్న రూ. 9 వేలను అపహరించాడు. పోలీసు బందోబస్తు ఉండగానే ఈ ఘటన జరగడంపై బాధితుడు ఆవేదనకు గురయ్యాడు.