భర్త తిట్టినందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. వరంగల్ స్టేషన్ రోడ్లోని ఓ ఇంట్లో భర్త కూర మంచిగా లేదని భార్య సర్వారి స్వర్ణముఖి (50)ని తిట్టారు. దీంతో మనస్థాపం చెందిన భార్య కార్పెంటైల్ పోసుకొని నిప్పుంటిచ్చుకుంది. స్థానికులు మంటలు ఆర్పి 108 సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.