బాలల కోసమే బాలరక్షా భవన్

68చూసినవారు
బాలల కోసమే బాలరక్షా భవన్
బాలల రక్షణకు సంబంధించిన అన్ని అంశాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని న్యాయ సేవ సంస్థ కార్యదర్శి జడ్జి క్షమా దేశ్ పాండే అన్నారు. మంగళవారం వారు హనుమకొండ జిల్లా బాలరక్షా భవన్ను వరంగల్ జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సాయి కుమార్ తో వారు సందర్శించారు. ఈ సందర్బంగా వారు బాలలకు సంబందించిన అన్ని విభాగాల అధికారులతో వారి పనితీరుపై క్షేత్ర స్థాయిలో ఆరా తీసారు. బాలల కోసమే బాలరక్షా భవన్ పని చేయాలనీ న్యాయ పరమైన సమస్యలకు ఎల్లపుడు సంస్థ అండగా ఉంటుందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్