వరంగల్ బల్దియా కు చెందిన పలు స్మార్ట్ సిటీ అభివృద్ది పనులకు టెండర్లు ఖరారు చేసినట్లు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి, సీఈఓ, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో ఇందుకు సంబందించిన సమావేశం సిడిఎం ఏఈఎన్ సి ఆధ్వర్యంలో జరిగిందని, ఇట్టి టెండర్ల ప్రక్రియ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయిన క్రమంలో తిరిగి ప్రారంభించడం జరురిగిందన్నారు.