మార్కెట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్

64చూసినవారు
మార్కెట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని మామునూరు ఏసిపి తిరుపతి ఆదివారం తెలిపారు. లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్గన్పూర్ , పాలకుర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉన్నందున 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సంబంధిత అధికారులు, ఏజెంట్లు వారికి మాత్రమే మార్కెట్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్