TG: తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో పాలన సాగిస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారీ చేశామన్నారు. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేశామని, చైనా ప్లస్ వన్ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం’ అని భట్టి తెలిపారు.