తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్ కేటాయించామని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు రేవంత్ పేర్కొన్నారు. ఎస్సీ గ్రూపులో ఎవరెవరు ఉండాలనేది విశ్లేషించామని సీఎం ప్రకటించారు.