ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే కిడ్నీ మార్పిడి చేశాం: డాక్టర్‌ శరత్‌బాబు

547చూసినవారు
ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే కిడ్నీ మార్పిడి చేశాం: డాక్టర్‌ శరత్‌బాబు
ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే మూత్రపిండాల మార్పిడి చికిత్స నిర్వహించామని శరత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ అధినేత డాక్టర్‌ జి.శరత్‌బాబు వెల్లడించారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 'కేతినేని వెంకటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశాం. అయన కుటుంబ మిత్రుడైన మధుబాబు మూత్రపిండం దానం చేశారు. కిడ్నీ విక్రయాలపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు’ అని శరత్‌బాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్