'సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం'.. పోలీసులకు మెసేజ్

78చూసినవారు
'సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం'.. పోలీసులకు మెసేజ్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్ లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. 'లైట్గా తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ శత్రుత్వం ఆగిపోవాలన్నా సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే ఘోరంగా ఉంటుంది' అని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Job Suitcase

Jobs near you