ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నిద్రించే సమయంలో 3-4సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తే వారి కిడ్నీ ఆరోగ్యంగా లేదని సూచిక అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అకారణంగా కాళ్లు, ముఖం వాపు, మూత్రంలో రక్తం కూడా కిడ్నీ జబ్బుల లక్షణాలేనని తెలిపారు. ఈ లక్షణాల ఆధారంగా వ్యాధిని గుర్తించాలంటే ఆలస్యమవుతుందని.. బీపీ, షుగర్, చర్మ రోగులు, స్మోకింగ్ చేసేవారు, చాలాకాలంగా మందులు వాడేవారు పరీక్షలు ముందుగా చేయించుకోవాలని వారు సూచించారు.