క్రికెట్ బెట్టింగ్‌లు, సైబర్ మోసాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రధాన సూత్రధారులు వీటిని వినియోగిస్తున్నారు. ఒక్కో సిమ్‌ను 10-15 రోజులు మాత్రమే ఉపయోగించి రూ.20-25 లక్షలు కొట్టేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలియగానే వాటిని నాశనం చేస్తున్నారు. కొనుగోలు చేసిన వారిని వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు రైతులు, విద్యార్థులు, ఆటోడ్రైవర్లు, గృహిణులు తారసపడుతున్నారు. నేరస్థుల చేతికి సిమ్‌కార్డులు చేరకుండా కట్టడి చేసేందుకు డీవోటీ ద్వారా ట్రాయ్‌కు నోటీసులు పంపనున్నారు.