తక్షణ కర్తవ్యం ఏమిటి?

మాయమైన మనుషులు, ధ్వంసమైన ఇళ్లు, ఛిద్రమైన బతుకులు, మానప్రాణాలు తీసే మృగాళ్లు, జీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు మణిపూర్ వర్తమాన ముఖచిత్రం ఇది. అందుకే ఆయుధాలు సమకూర్చుకుని అధికార ప్రభుత్వ అండదండలతో ఇన్నాళ్ల నుంచీ రెచ్చిపోతున్న ముఠాల ఆటకట్టించటం తక్షణావసరం. ఏం జరిగినా ముందు చట్టబద్ద పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవటం తక్షణ కర్తవ్యం. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి.