భారత్‌లో బాలికల కోసం 1847 వరకు ప్రత్యేకంగా పాఠశాల లేదు. బాల్య వివాహాలు, విద్య నిరాకరణకు వ్యతిరేకంగా ఈశ్వరచంద్ విద్యాసాగర్, రాజారామ్మోహన్ రాయ్ వంటి అభ్యుదయవాదుల పోరాటాల ఫలితంగా 1847లో బెంగాల్ లో కాళీకృష్ణ బాలికల ఉన్నత పాఠశాల స్థాపన జరిగింది. భారత్‌లోని మొట్టమొదటి బాలికల పాఠశాల ఇదే. ఆ తర్వాత సంఘ సంస్కర్తలు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రీబాయి పూలే 1848లో పుణెలో బాలికల పాఠశాలను ప్రారంభించారు.