హైదరాబాద్ మార్కెట్లో విస్కీ ఐస్‌క్రీమ్ మత్తుమందు కలకలం రేపుతోంది. చిన్న పిల్లలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లో విస్కీని కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా మంది చిన్నపిల్లలు ఈ ఐస్‌క్రీమ్ ను తినేందుకు అలవాటు పడ్డట్టు తెలుస్తోంది. 'అయితే ఈ ఐస్‌క్రీమ్‌లో 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మి.లీ విస్కీని కలుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కంపెనీ నిర్వహకులు దయాకర్ రెడ్డి, శోభన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.