గుజరాత్‌లోని వడోదరలో ఆదివారం రాత్రి విషాద ఘటన జరిగింది. భార్యాభర్తలు రోడ్డుపై వాకింగ్ కోసం బయల్దేరారు. ఆ సమయంలో ఓ స్కార్పియో కారు వేగంగా దూసుకొచ్చింది. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో వాకింగ్ చేస్తున్న దంపతులను ఆ కారు ఢీకొట్టింది. భార్య స్పాట్‌లోనే చనిపోయింది. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. తన కళ్ల ముందే భార్య చనిపోవడంతో ఆ వ్యక్తి హృదయవిదారకంగా రోదించాడు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.