రష్మికను కూడా అరెస్టు చేస్తారా?
సంధ్య థియేటర్ వద్ధ జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన పోలీసులు హీరోయిన్ రష్మిక మందన్నను కూడా అరెస్టు చేస్తారా? అన్న సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాట జరిగిన రోజు రష్మిక కూడా థియేటర్‌లో ఉందని, అల్లు అర్జున్, చిత్రబృందంతో కలిసి ఆమె సినిమా చూసిందని గుర్తు చేసుకుంటున్నారు. రిమాండ్ అనంతరం బన్నీని చంచల్‌గూడ తరలించగా, మధ్యంతర బెయిల్ వచ్చింది.