వెస్టిండీస్ క్రికెటర్ క్రెగ్ బ్రాత్‌వైట్ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 86 టెస్టులు ఆడిన విండీస్ ప్లేయరుగా ఆయన ఘనత సాధించారు. ఈ క్రమంలో 52 ఏళ్ల క్రితం నమోదైన గార్ఫీల్డ్ సోబర్స్ (85) రికార్డును బ్రాత్ వైట్ అధిగమించారు. 2014 నుంచి 2024 వరకు ఆయన ఒక్క టెస్టు మ్యాచ్ కూడా మిస్ కాలేదు. కాగా 32 ఏళ్ల బ్రాత్ వైట్ తన పదేళ్ల కెరీర్‌లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం.