సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కొందరు ఎంచుకున్న మార్గం రీల్స్. ఈ క్రమంలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. తాజాగా, అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీల్స్ కోసం ఓ మహిళ ఒక పాత రేకుల ఇంటిపై నిల్చొని డ్యాన్స్ చేస్తుంది. కిందికి దూకే క్రమంలో తన చీర ఆ రేకులకు తట్టి, బొర్లాబొక్క పడుతుంది. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది.