ప్రపంచ మహా సముద్రాల దినోత్సవాన్ని 2024లో జూన్ 8న నిర్వహించారు. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవాన్ని ఏటా ఈ రోజున నిర్వహించాలని 2008, డిసెంబర్ 5న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 63/111 తీర్మానం ద్వారా నిర్ణయించింది. 1992లో రియో డి జనీరోలో జరిగిన వర్క్ సమిట్‌లో ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించారు. 2024 ప్రపంచ మహా సముద్రాల దినోత్సవ థీమ్: ఎవేకెన్ న్యూ డెప్త్స్.