ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన విషయాలపై ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్యసమితి 1989లో దీనిని ప్రారంభించింది. 1987 జులై 11 నాటికి ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకోవడంతో ఆరోజునే ప్రపంచ జనాభా దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా జూలై 11 న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.