నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘మనం రోజూ కనిపిస్తూ ఉంటే మన గురించి వార్తలు వచ్చినా ఎవరూ నమ్మరు. గతంలో నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉండడంతో రకరకాల వార్తలు రాశారు. నాఆర్థిక స్థితి బాలేదని, టీ అమ్ముకొని బతుకుతున్నట్లు దారుణంగా రాశారు. నాపై అలా రాయడం చూసి బాధపడ్డాను’’ అని తెలిపారు.