ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పై శనివారం అవిశ్వాస తీర్మానం జరగనుంది. మున్సిపల్ లో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ ఎనిమిది మంది కౌన్సిలర్లు ఇటీవల జిల్లా కలెక్టర్ హనుమంతుకు తీర్మాన పత్రాలను అందజేశారు. అయితే కలెక్టర్ 27న అవిశ్వాసం పై సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. అవిశ్వాసం నెగ్గనుందా లేదా అనే విషయం కాసేపట్లో తేలబోతోంది.